తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Sarkaru Vaari Paata: మహేశ్​బాబు.. బ్యాక్ ఇన్ యాక్షన్ - mahesh babu latest news

స్టార్ హీరో మహేశ్​ 'సర్కారువారి పాట' షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Sarkaru Vaari Paata movie resumes its shoot
మహేశ్​బాబు

By

Published : Jul 12, 2021, 6:47 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు.. తిరిగి యాక్షన్​లోకి దిగారు. 'సర్కారు వారి పాట' షూటింగ్.. హైదరాబాద్​లో సోమవారం పున ప్రారంభమైంది. మహేశ్​ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ విషయాన్ని చెబుతూ, ఓ ఫొటోను విడుదల చేశారు. ఇందులో మహేశ్​తో పాటు దర్శకుడు పరశురామ్, నిర్మాత కనిపించారు.

మహేశ్​ 'సర్కారువారి పాట'

ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. అర్జున్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. బ్యాంకుల ఎగవేత నేపథ్య కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని​ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేశ్​బాబు సరికొత్త లుక్​లో స్టైలిష్​గా కనిపించనున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి 'సర్కారువారి పాట' రానుంది.

మహేశ్​ 'సర్కారువారి పాట'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details