తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' పాటకు రష్మిక అదిరిపోయే స్టెప్పులు - mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలోని మూడో పాటను ఈనెల 16న విడుదల చేయనుంది చిత్రబృందం. అందుకు సంబంధించిన వివరాలను హీరోయిన్​ రష్మిక సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

sarileru
మహేశ్

By

Published : Dec 13, 2019, 6:43 PM IST

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్‌బాబు హీరోగా, రష్మిక హీరోయిన్​గా నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతికి విడుదలవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్​లో జోరుపెంచింది చిత్రబృందం. ప్రతి సోమవారం ఓ పాటను విడుదల చేస్తూ అభిమానులను ఖుష్ చేస్తోంది. తాజాగా వచ్చే సోమవారం (డిసెంబర్ 16) విడుదల చేయబోయే పాటకు సంబంధించిన వివరాలను కథానాయిక రష్మిక నెట్టింట పంచుకుంది.

'హీ ఈజ్ క్యూట్, హీ ఈజ్ స్వీట్'​ అంటూ పాటకు స్టెప్పులేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది రష్మిక. ఇది కాస్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు.

ఇవీ చూడండి.. 'ధూమ్‌' తరహాలో నాని, సుధీర్​ల 'వి'..!

ABOUT THE AUTHOR

...view details