తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దీపావళికి మహేశ్ సర్​ప్రైజ్ సిద్ధం..! - మహేశ్​బాబు దీపావళి కానుక

'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం దీపావళికి ప్రత్యేక కానుకను సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

దసరాకు అభిమానులకు మహేశ్​ సర్​ప్రైజ్..!

By

Published : Oct 21, 2019, 12:15 PM IST

సూపర్​స్టార్ మహేశ్‌బాబు.. ఈ దీపావళి పండుగ నాడు అభిమానులను సర్​ప్రైజ్​ చేయనున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి ఓ ప్రత్యేక కానుకను ఆ రోజు విడుదల చేయనున్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. ఓ ప్రత్యేక పోస్టర్‌ను పోస్ట్‌ చేశాడు.

'విలన్‌ హౌస్‌ షెడ్యూల్‌ పూర్తియ్యింది. 'సరిలేరు నీకెవ్వరు' నుంచి దీపావళి కానుక కోసం సిద్ధంగా ఉండండి' -ట్విట్టర్​లో అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి ట్వీట్ చేసిన ఫొటో

ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మేజర్ అజయ్‌ కృష్ణగా కనిపించనున్నాడు మహేశ్​. రష్మిక హీరోయిన్. విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'సాహో'పై అమెజాన్ బాస్​కు ఫ్యాన్స్​ ఫిర్యాదు..!

ABOUT THE AUTHOR

...view details