తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీతో సినిమా చేసేందుకు బీటౌన్ దర్శకుడు రెడీ - సంజయ్ గుప్తా వార్తలు

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా టాలీవుడ్ చిత్రం 'అల వైకుంఠపురములో' చూశారు. తాజాగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో తెలుపుతూ అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించారు.

బన్నీతో సినిమా చేసేందుకు బీటౌన్ దర్శకుడు రెడీ
బన్నీతో సినిమా చేసేందుకు బీటౌన్ దర్శకుడు రెడీ

By

Published : Jul 13, 2020, 3:55 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకుంది. బన్నీ నటన, త్రివిక్రమ్ స్టైలిష్ మేకింగ్, పూజా హెగ్డే అందాలు, తమన్ సంగీతం ఇలా అన్నీ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ సినిమా పాటలు ఇప్పటికీ యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా.. అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించారు.

"ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రాన్ని నెట్​ఫ్లిక్స్​లో చూశా. సినిమా చాలా బాగుంది. వినోదం పక్కా. థియేటర్లో చూడకపోతే జీవితంలో ఏదో కోల్పోయిన వాడిని అవుతా. కరోనా పరిస్థితులు తగ్గిన వెంటనే బిగ్​స్క్రీన్​పై చూస్తా."

-సంజయ్ గుప్తా, దర్శకుడు

ఈ ట్వీట్​పై స్పందించిన అల్లు అర్జున్​ "మీరు మా సినిమా చూడటం సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీకు నచ్చినందకు ధన్యవాదాలు." అంటూ రిప్లై ఇచ్చారు. అయితే దీనిపై మళ్లీ సంజయ్ స్పందిస్తూ.. "ఈ చిత్రం చూసి మీకు పెద్ద ఫ్యాన్ అయ్యా. మీ నటనతో నన్ను నవ్వించావు. ఏడ్పించావు. మీతో పని చేసే అవకాశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా." అని తెలిపారు.

'కాబిల్', 'షూటౌట్ ఎట్ వాదాలా', 'జ‌జ్బా', 'ముంబయి సాగా' వంటి సినిమాల‌తో బీటౌన్‌లో సంజయ్‌ డైరెక్ట‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details