ప్రస్తుతం 'సర్కారు వారి పాట'(sarkaru vari pata first look) సినిమాతో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఆ తర్వాత త్రివిక్రమ్(trivikram mahesh movie) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(sanjay dutt mahesh babu ) ఓ కీలక పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. పవర్ఫుల్ రాజకీయనేతగా ఆయన కనిపించనున్నారని సమాచారం.
మహేశ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్! - మహేశ్ బాబు
త్రివిక్రమ్-మహేశ్‌బాబు(trivikram mahesh movie) కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ నటించనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
మహేశ్
ఇప్పటికే సంజయ్.. 'కేజీఎఫ్ 2' చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించారు. ఈసారి దీనిని మించేలా మహేశ్ మూవీలోని పాత్ర ఉంటుందట! త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇక ఈ సినిమాకు 'పార్థు' అని టైటిల్ పెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. హీరోయిన్గా పూజాహెగ్డే నటించనుంది.
ఇదీ చూడండి: మహేష్‌కి విలన్‌గా ప్రముఖ దర్శకుడు
Last Updated : Sep 8, 2021, 3:07 PM IST