తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2' షూటింగ్ కోసం సంజయ్ దత్ రెడీ - సంజయ్ దత్ క్యాన్సర్

తనకొచ్చిన క్యాన్సర్​ గురించి వెల్లడించిన ప్రముఖ నటుడు సంజయ్ దత్.. త్వరలోనే దానిని జయిస్తానని అన్నారు. ప్రస్తుతం 'కేజీఎఫ్ 2' షూటింగ్ కోసం సిద్ధమవుతున్నానని తెలిపారు.

Sanjay Dutt back in action gears up for KGF Chapter 2 shoot
'కేజీఎఫ్ 2' షూటింగ్ కోసం సంజయ్ దత్ రెడీ

By

Published : Oct 16, 2020, 3:29 PM IST

అనారోగ్య కారణాల వల్ల రెండు నెలలు నటనకు విరామమిచ్చిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. 'కేజీఎఫ్ 2' షూటింగ్​కు సిద్ధమైనట్లు చెప్పారు. నలుపు రంగు టీషర్ట్​తో ఉన్న ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

క్యాన్సర్​ గురించి సంజయ్ మాటల్లో

ఆగస్టు 11న సంజయ్ దత్.. ముంబయిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో నెగిటివ్ వచ్చింది. కానీ శ్వాసకోస సమస్యలున్నాయని, చికిత్స కోసం కుటుంబంతో కలిసి ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చారు. అయితే తన ఆరోగ్యం గురించి అప్పుడు చెప్పని సంజయ్.. త్వరలోనే క్యాన్సర్​ను జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధరణ అయింది.

వేగవంతంగా 'కేజీఎఫ్ 2' చిత్రీకరణ

బెంగళూరులో ప్రస్తుతం 'కేజీఎఫ్2' షూటింగ్ జరుగుతోంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. నవంబరు తొలి వారంలో సంజయ్.. సెట్స్​లో అడుగుపెట్టనున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇది చదవండి:క్యాన్సర్​ను త్వరలోనే జయిస్తా: సంజయ్ దత్

ABOUT THE AUTHOR

...view details