తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జావేద్​ ఆరోపణలపై 'పీఎం నరేంద్రమోదీ' టీం వివరణ - online

పీఎమ్ నరేంద్రమోదీ చిత్ర నిర్మాత సందీప్ సింగ్ రచయిత జావేద్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో జావేద్ రాసిన చిత్రాల్లో పాటలను వాడుకున్నందుకుగాను ఆయన పేరును పోస్టర్​లో వేశామని ట్వీట్ చేశాడు సందీప్ సింగ్.

జావేద్ అక్తర్

By

Published : Mar 23, 2019, 3:54 PM IST

ప్రముఖ రచయిత జావేద్ వ్యాఖ్యలపై స్పందించారు 'పీఎమ్ నరేంద్రమోదీ' చిత్ర నిర్మాత సందీప్ సింగ్. గతంలో వచ్చిన 'దస్', '1947 ఎర్త్' చిత్రాల్లో జావేద్ అక్తర్ రాసిన పాటలను మోదీ బయోపిక్​లో ఉపయోగించామని, అందుకే ఆయన పేరు వేశామని బదులిచ్చారు. పీఎమ్ నరేంద్ర మోదీ చిత్ర పోస్టర్​పై తన పేరును వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్.

సందీప్ సింగ్ ట్వీట్

మేము 1947 'ఎర్త్' చిత్రంలోని 'ఈశ్వర్ అల్లా', 'దస్' సినిమాలోని 'సునో గౌర్ సే దునియా వాలో' పాటలను మోదీ బయోపిక్​లో వాడాం. జావేద్ అక్తర్ గౌరవార్థం ఆయన పేరును మా సినిమా పోస్టర్​పై వేశాం -సందీప్ సింగ్ , సినీ నిర్మాత

"పీఎమ్ నరేంద్రమోదీ చిత్రపోస్టర్​పై నా పేరు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను అసలు ఆ సినిమాలో పాటలు రాయలేదు" అని జావేద్ అక్తర్ ట్వీట్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. జావేద్ పేరును వాడుకోవడాన్ని తప్పుబట్టారు నెటిజన్లు.

'పీఎమ్ నరేంద్ర మోదీ' చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ABOUT THE AUTHOR

...view details