తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2019, 1:56 PM IST

ETV Bharat / sitara

'వారు 2 స్టార్లు ఇస్తే ప్రేక్షకులు 200కోట్లు ఇచ్చారు'

'కబీర్ సింగ్' సినిమాపై క్రిటిక్స్ చేస్తోన్న విమర్శలు అర్థవంతంగా లేవని అన్నాడు దర్శకుడు సందీప్ వంగా. సినిమా టేకింగ్ గురించి మాట్లాడకుండా దర్శకుడినే టార్గెట్ చేశారని మండిపడ్డాడు.

సందీప్

తెలుగులో ఘనవిజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' బాలీవుడ్​లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ అయింది. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ హీరోహీయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే మూవీపై కొన్ని విమర్శలూ వస్తున్నాయి.

కబీర్​ సింగ్​పై క్రిటిక్స్ చేస్తున్న విమర్శలకు ఓ ఇంటర్వ్యూ ద్వారా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు దర్శకుడు సందీప్‌ వంగా.

"ఈ చిత్రంలో 24 క్రాఫ్ట్స్‌ ఉంటే.. విమర్శకులంతా కలిసి ఒక దర్శకుడిపైనే దృష్టి పెట్టారు. మా సినిమాను విమర్శించిన వారిలో ఒక్కరు కూడా ఇందులోని ఫొటోగ్రఫీ ఎలా ఉంది, కలర్‌ థీమ్‌ ఏ విధంగా ఉంది, బ్యాక్​గ్రౌండ్‌ స్కోర్, సౌండ్‌ డిజైన్‌ వంటివి ఎలా ఉన్నాయన్న అంశాలపై మాట్లాడలేదు. ముందు అవి ఎలా ఉన్నాయో ప్రేక్షకులకు చెప్పాలి కదా. ఇలాంటి విమర్శకుల వల్ల చిత్ర పరిశ్రమకు చాలా నష్టం జరుగుతుంది. కొందరు మా చిత్రానికి రెండు స్టార్లు ఇచ్చారు. కానీ... ప్రేక్షకులు మాత్రం మాకు రూ.200 కోట్లు ఇచ్చారు. 'అర్జున్‌ రెడ్డి' విషయంలో విమర్శలు వచ్చినా.. వారంతా టేకింగ్‌ తదితర అంశాలపైనా మాట్లాడారు. ఏదేమైనా మా చిత్రం విజయం సాధించడం పట్ల విమర్శకులు సంతోషంగా లేరని అర్థమైంది" అన్నాడు సందీప్‌.

ఇవీ చూడండి.. బాటిల్ క్యాప్ ఛాలెంజ్ అప్పట్లోనే...

ABOUT THE AUTHOR

...view details