కన్నడ చిత్రపరిశ్రమలోని డ్రగ్స్ కేసులో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. దర్యాప్తులో భాగంగా సినీ నటులు అకుల్ బాలాజీ, సంతోశ్ కుమార్ సహా మాజీ ఎమ్మెల్యే ఆర్వీ దేవరాజ్ కుమారుడు యువరాజ్‌ను విచారణకు హాజరు కావాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో కొంత సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పైన సూచించిన వారిని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు సీసీబీ అధికారుల ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
ఇద్దరు నటులు, మాజీ ఎమ్మెల్యే కుమారుడికి సమన్లు - రాగిణి
శాండల్‌వుడ్ డ్రగ్ కేసు విచారణలో భాగంగా మరో ఇద్దరు నటులతో పాటు, మాజీ ఎమ్మెల్యే కుమారుడికి సీసీబీ సమన్లు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
డ్రగ్ కేసు
అకుల్ బాలాజీ టెలివిజన్ సీరియల్స్‌తో పాటు, కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఇప్పటికే కేసుతో సంబంధమున్న సినీ నటి రాగిణి ద్వివేది, సంజన గల్రానీ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రేవ్ పార్టీలకు మాదకద్రవ్యాలు సరఫరా చేశారని వీరిపై అభియోగాలు మోపారు.