తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరద బాధితులకు సంపూ రూ.2లక్షల విరాళం - కత్తి మహేశ్​

ఉత్తర కర్ణాటకలోని వరద బాధితుల్ని ఆదుకునేందుకు నటుడు సంపూర్ణేశ్​బాబు ముందుకొచ్చాడు. తన వంతు సాయంగా రూ.2 లక్షల విరాళాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశాడు.

వరద భాదితులకు సంపూర్ణేశ్​బాబు సహాయం

By

Published : Aug 14, 2019, 9:52 PM IST

Updated : Sep 27, 2019, 1:05 AM IST

హైదరాబాద్​లో 'కొబ్బరిమట్ట' చిత్రబృందం వేడుకలు

తనదైన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించే బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. ఉత్తర కర్ణాటకలో వరదల ధాటికి కకావికలమైన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు.

తను హీరోగా నటించిన 'కొబ్బరిమట్ట' చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రస్తుతం మంచి వసూళ్లు సాధిస్తుండటంపై ఆనందంగా ఉన్న సంపూ... హైదరాబాద్​లో చిత్ర బృందంతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత సాయిరాజేశ్​తో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నట్లు చెప్పాడు.

ఇది చదవండి: ప్రఖ్యాత అత్తివరదరాజస్వామి సేవలో రజనీకాంత్

Last Updated : Sep 27, 2019, 1:05 AM IST

ABOUT THE AUTHOR

...view details