తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సైరా'ను పోలిన సమీరా కూతురి పేరు...! - sameera reddy daughter name as nyra

'జై చిరంజీవ' సినిమాతో ప్రేక్షకుల మదిని దోచుకుంది హీరోయిన్ సమీరా రెడ్డి. ఆమె ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ పాపకు 'నైరా' అని నామకరణం చేసినట్లు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది.

'సైరా'ను పోలిన సమీరా కూతురి పేరు...!

By

Published : Aug 2, 2019, 9:49 AM IST

పదిహేనేళ్ల క్రితం 'నరసింహుడు' చిత్రంతో హీరోయిన్​గా తెలుగు తెరకి పరిచయమైన సమీరా రెడ్డి... దక్షిణాదిన అన్ని భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు 30కి పైగా సినిమాలు చేసిన ఈ అమ్మడు... 2014లో అక్ష‌య్ అనే వ్యాపారవేత్త‌ను వివాహం చేసుకొని సినిమాల‌కి దూర‌మైంది. కాని ఎప్పుడూ సోషల్​ మీడియాలో ఏదో ఒక విషయం పంచుకొంటూ యాక్టివ్​గానే ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు స్విమ్మింగ్​ పూల్​లో ఈత, వ్యాయామం వంటి పనులు చేసి అభిమానులు అవాక్కయ్యేలా చేసింది. తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పాపకు 'నైరా' అనే పేరు పెట్టింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

సమీరా షేర్​ చేసిన ఫొటోలు

ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకంటే మెగాస్టార్​ చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రంలో నటించిన ఈ అమ్మడు.. ఆయన మీద అభిమానంతో 'సైరా' అని ధ్వనించేలా తన కూతురుకు నామకరణం చేసిందని నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details