డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేరును రియా చక్రవర్తి బయటపెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. వారిద్దరికి మాదక ద్రవ్యాల మాఫియాతో సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
డ్రగ్స్ కేసు : రకుల్‌కు మద్దతుగా సమంత - rakul preet singh in drugs case
మాదక ద్రవ్యాల కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించడంపై స్పందించింది సమంత. ఆమెకు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది.
సామ్
అయితే తాజాగా దీనిపై స్పందించిన హీరోయిన్ సమంత.. రకుల్, సారాకు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అంతకుముందే ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా.. తాము డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్‌కు చెందిన ఎటువంటి సెలబ్రిటీల పేర్ల జాబితాను తయారు చేయలేదని చెప్పారు. ఈ విషయాన్నే సామ్ షేర్ చేసింది. దీంతో నెటిజన్లు కూడా సారీ రకుల్, సారా అంటూ మళ్లీ ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు.