తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జాను' పాత్రను పూర్తి చేసిన సమంత - 96 samantha

తమిళ సూపర్​హిట్​ చిత్రం '96' తెలుగు రీమేక్​లో శర్వానంద్​, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో 'జాను'గా కనిపించనుంది సామ్​. తాజాగా తన క్యారెక్టర్​కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

96 రీమేక్​లో సమంత లుక్​ చూశారా..?

By

Published : Oct 13, 2019, 12:04 PM IST

తమిళంలో ఘనవిజయం అందుకున్న '96' సినిమా తెలుగు రీమేక్‌లో సమంత షెడ్యూల్​ పూర్తయింది. హీరో శర్వానంద్​కు ప్రేయసిగా సామ్​ కనిపించనుంది. ఇందులో 'జాను' అనే పాత్రలో సందడి చేయనుందీ అందాల భామ. ఈ సినిమాకు 'జానకీ దేవీ' అనే టైటిల్​ను పరిశీలిస్తోంది చిత్రబృందం. ఈ పేరునే ఇటీవల ఫిలిం ఛాంబర్​లో రిజిస్టర్​ చేయించినట్లు తెలుస్తోంది.

96 రీమేక్​లో సమంత

సినిమాలో ప్రముఖ గాయని ఎస్‌ జానకికి వీరాభిమాని పాత్రను పోషించనుందట సమంత. జానకి పాడిన పాటలన్నీ కథానాయిక పాడుతూ ఉంటుందట.

చిత్రీకరణలో సామ్​

తెలుగు సినిమా రీమేక్​ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సొంతం చేసుకున్నాడు. మాతృకను తీసిన సి. ప్రేమ్‌ కుమార్‌ రీమేక్‌నూ తెరకెక్కిస్తున్నాడు. కానీ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా సమంత, శర్వానంద్‌ పాఠశాల రోజులపై తెలుగు రీమేక్‌లో పెద్దగా ఫోకస్‌ చేయడం లేదట. కాలేజీ రోజుల్లో ప్రేమను ఎక్కువగా చూపించనున్నట్లు తెలుస్తోంది. గోవింద్‌ వసంత సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details