Samantha Yasodha Movie: విభిన్నమైన కథలు, మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్లో జోరు ప్రదర్శిస్తోంది హీరోయిన్ సమంత. ఆమె నటించనున్న భారీ బడ్జెట్ సినిమాల్లో 'యశోద' ఒకటి. ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం కొడైకెనాల్లోని రూ.3 కోట్ల వ్యయంతో వేసిన ఓ భారీ సెట్లో చిత్రీకరణ చేస్తున్నారట! దీని కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ రంగంలోకి దిగారు.
హాలీవుడ్ సినిమాలు 'ట్రాన్స్పోర్టర్ 3', 'ప్రాజెక్ట్ 7', 'సిటీ హంటర్', 'ఇన్సెప్షన్', 'డంకర్క్' వంటి సినిమాలకు ఆయన పని చేశారు. సమంత నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్‌కు కూడా ఆయనే పనిచేశారు.