తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమంత త్వరలో సినిమాలకు దూరం కానుందా? - సమంత శాకుంతలం

రెండు చిత్రాలు చేస్తున్న సమంత.. కొత్తగా ఏం కథలు వినట్లేదట. దీంతో ఆమె నటనకు స్వస్తి చెప్పనుందని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆమె మనసులో ఉన్న ఆలోచన ఏంటి?

Samantha Rejecting New Films,
హీరోయిన్ సమంత అక్కినేని

By

Published : Mar 4, 2021, 8:44 AM IST

సమంత ఇక సినిమాలు చేయదా? త్వరలో నటనకు గుడ్​బై చెప్పనుందా? లాంటి ప్రశ్నలు సగటు సినీ అభిమానికి వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయి!

ఇంతకీ ఏమైంది?

గుణశేఖర్ 'శాకుంతలం', తమిళంలో 'కాతువక్కల్ రెండు కాదల్' సినిమాలతో సమంత ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ రెండూ కాకుండా కొత్తగా కథలు వినేందుకు ఈమె ఆసక్తి చూపించట్లేదట. వైవాహిక జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టేందుకే సమంత ఇలా చేస్తోందని అనుకుంటున్నారు! ఆ వ్యాఖ్యల్ని కొట్టిపారేసిన సమంత.. అవన్నీ వదంతులేనని తేల్చింది. కానీ కొత్తగా ఆమె ఏ సినిమాలను ఒప్పుకోకపోవడం అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సమంత-నాగచైతన్యలకు 2017లో వివాహం జరిగింది.

హీరోయిన్ సమంత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details