తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమంత స్పెషల్ సాంగ్ రచ్చ.. 100 మిలియన్​ వ్యూస్​తో సెన్సేషన్ - pushpa collection

Samantha Pushpa song: 'ఊ అంటావా ఊహు అంటావా' అంటూ సమంత చేసిన సందడి దుమ్ములేపుతోంది. వ్యూస్​తో ఈ సాంగ్ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే గీతం సరికొత్త మార్క్​ను చేరుకుంది.

samantha item song
సమంత ఐటమ్ సాంగ్

By

Published : Dec 20, 2021, 9:38 PM IST

Updated : Dec 21, 2021, 9:35 AM IST

Pushpa movie: ముద్దుగుమ్మ సమంత తొలిసారి చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటవా ఊహు అంటవా'. 'పుష్ప' సినిమాలోని ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది. యూట్యూబ్​, థియేటర్​లో అనే తేడా లేకుండా ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పుడు ఈ గీతం సరికొత్త రికార్డు సృష్టించింది.

అన్ని భాషల్లో కలిపి ఈ లిరికల్ వీడియో 100 మిలియన్​ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. అలానే సమంత కూడా తన్​ ఇన్​స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. "గుడ్, బ్యాడ్, ఫన్నీ, సీరియస్, టాక్ షో హోస్ట్​గా ఇలా అన్నింట్లో కష్టపడి పనిచేశాను. అలానే సెక్సీగా కనిపించడానికి చాలా హార్డ్​వర్క్ చేయాలి" అని రాసుకొచ్చింది.

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2021, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details