తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సమంత ఒప్పుకోదు అనుకున్నాం' - సమంత లేటేస్ట్ న్యూస్

ద ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్​లో సమంత పాత్ర అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని దర్శకులు చెప్పారు. జూన్ రెండో వారం నుంచి ఈ సీజన్​ స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలుస్తోంది.

samantha performance in 'The Family man 2' will shock everyone: Raj & DK
సమంత

By

Published : May 15, 2021, 5:11 PM IST

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే జూన్ 11 నుంచి ఈ సిరీస్, అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ కానుందని సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శక ద్వయం రాజ్​-డీకే.. సమంత పాత్ర గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఆమె రోల్​ ప్రేక్షకులను షాక్​కు గురిచేస్తుందని తెలిపారు.

ద ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్​లో సమంత

"ఇందులో సమంత బోల్డ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇలాంటి రోల్​లో నటించేందుకు సమంత ఒప్పుకొంటుందా లేదా అని కొంచెం సంశయించాం. కానీ కథ చెప్పగానే ఆమె చాలా ఎగ్జయిట్​ అయి, చేస్తానని​చెప్పింది. ఈ సిరీస్​లోని ఆమె పాత్ర కచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది" అని రాజ్-డీకే చెప్పారు.

ఎన్​ఐఏలో సీక్రెట్​ ఏజెంట్​ శ్రీకాంత్.. ఉగ్రవాదుల మధ్య జరిగే కథతో 'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్​ తీశారు. 2019లో వచ్చిన తొలి సీజన్​ ప్రేక్షకుల మనసులు గెల్చుకుని, సిరీస్​పై ఆసక్తిని పెంచింది. అయితే రెండో సీజన్​లో నటించిన సమంత.. రాజీ అనే ఉగ్రవాది పాత్రలో కనిపించనుందనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details