అగ్రకథానాయిక సమంత తన జీవనశైలిలో వ్యాయామాన్ని ఓ భాగం చేసుకున్నారు. ఆమె శారీరక దృఢత్వానికి అధిక ప్రాముఖ్యం ఇస్తుంటారు. ఇప్పటికే అనేక సార్లు సామ్ వ్యాయామశాలలో కసరత్తులు చేస్తుండగా తీసిన వీడియోలు, ఫొటోలను షేర్ చేశారు. తాజాగా సామ్ 100 కిలోల బరువును సునాయాసంగా పైకెత్తింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు,తోటి సెలబ్రిటీలు ఆశ్చర్యపోతున్నారు. న్యూ ఐరన్ లేడీ... మీరు స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
జిమ్లో వంద కిలోల బరువు ఎత్తేసిన సమంత - samantha in gym
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఫిట్నెస్పై చాలా శ్రద్ధ తీసుకుంటారు. తాజాగా ఆమె 100 కిలోల బరువు ఎత్తిన వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
సమంత వంద కిలోలు ఎత్తేసింది..
నాగచైతన్య-సమంత కలిసి నటించిన 'మజిలీ’ సినిమా మంచి విజయం అందుకుంది. ఆమె నటించిన ‘ఓ బేబీ’ సినిమా నిర్మాణాంతర పనుల్లో ఉంది. ప్రస్తుతం సామ్ ‘మన్మథుడు-2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.