యువ కథానాయిక సమంత.. బయోపిక్‌లో నటిస్తుందా? అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కర్ణాటకకు చెందిన ప్రముఖ గాయని, కళాకారిణి నాగరత్నమ్మ జీవితగాథను వెండితెరపై ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నారట సింగీతం.
ఆ బయోపిక్‌లో అక్కినేని కోడలు! - Samantha new movie updates
టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత త్వరలోనే ఓ బయోపిక్‌లో నటించనుందని సమాచారం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించే ఈ సినిమా కథ నచ్చి సామ్ ఓకే చెప్పిందని తెలుస్తోంది.
సమంత
భరతనాట్యం, కర్ణాటక సంగీతం అంతరించకుండా ఉండేందుకు ఎనలేని సేవ చేసిన రత్నమ్మ బాల్యం, సంగీత ప్రయాణం సినీ అభిమానులకు చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రత్నమ్మ పాత్రలో సమంత అయితే బాగుంటుందని, ఈ మేరకు ఆమెతో చర్చలు జరిపారని టాక్. పాత్ర నచ్చితే చాలు ఎలాంటి సినిమాకైనా ఓకే చెప్పే సామ్ ఈ బయోపిక్‌కు పచ్చజెండా ఊపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.