తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Samantha award: సమంతకు ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్డు - సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సీన్స్

Samantha family man 2: స్టార్ హీరోయిన్ సమంత మరో ఘనత సాధించింది. ఇప్పటికే దక్షిణాదిలో చాలా సినిమాల్లో నటించి, అభిమానుల్ని మెప్పించిన సామ్.. వారి అభిమానంతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో అవార్డు చేరింది.

samantha family man 2
సమంత ఫ్యామిలీ మ్యాన్ 2

By

Published : Dec 10, 2021, 11:00 AM IST

Samantha news: ఎన్నో సినిమాలో హీరోయిన్​గా చేసిన సమంత.. వాటికి భిన్నంగా తొలిసారి 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్​లో ప్రతినాయక లక్షణాలున్న పాత్ర చేసింది. రాజీగా ఆడియెన్స్​ను మెస్మరైజ్ చేసింది. మరి ప్రేక్షకుల మెచ్చుకున్న తర్వాత అవార్డులు వరించకుండా ఉంటాయా? అలా వచ్చిందే ఇది.

ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్డుతో సమంత

Filmfare OTT awards: గురువారం ముంబయిలో ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో భాగంగానే 'ఫ్యామిలీ మ్యాన్ 2' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సమంత అవార్డు గెలుచుకుంది.

ఈమెనే కాకుండా ఈ సిరీస్​కు బెస్ట్ ఒరిజినల్​ స్క్రీన్​ప్లే, బెస్ట్ ఒరిజినల్​ స్టోరీ, బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ యాక్టర్(మేల్) విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.

అవార్డులతో ఫ్యామిలీ మ్యాన్ టీమ్

ఎన్నో వివాదాల నడుమ ఓటీటీలో విడుదలైన వెబ్​సిరీస్​ 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రఖ్యాత ఐఎమ్​డీబీ టీవీ సిరీస్​ ర్యాంకింగ్స్​లో ఈ సిరీస్​కు నాలుగో స్థానం దక్కింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్‌ 2'ను దర్శకద్వయం రాజ్‌, డీకే తెరకెక్కించారు. ఈ సిరీస్​లో తమిళ ఈలం సోల్జర్​ రాజీగా సమంత నటించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details