తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'96' చిత్రంలో సమంత లుక్​ ఇదేనా..? - samantha

తమిళ చిత్రం '96'ను తెలుగులో రీమేక్​ చేస్తున్నారు. దిల్​రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా సమంత లుక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సమంత

By

Published : Jul 23, 2019, 11:53 AM IST

Updated : Jul 23, 2019, 4:39 PM IST

శర్వానంద్, సమంత నటిస్తోన్న కొత్త చిత్రం '96.' గతేడాది తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్​ చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రంలో సమంతకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది.

మాతృకలో నటించిన త్రిషను పోలినట్టే ఉంది సమంత. మైక్ పట్టుకుని పాడుతున్న సామ్​ చిత్రం సామాజిక మాధ్యామాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్​డేట్స్​ లేని కారణంగా ఇంతకాలం సినిమా ప్రారంభమైందో లేదో అన్న వార్తలు వచ్చాయి. తాజాగా సమంత ఫొటో బయటకు రావడం వల్ల అనుమానం తీరినట్టే అనిపిస్తుంది.

సమంత

ఏది ఏమైనా ఈ ఫొటో చూసిన అభిమానులు మాత్రం పాత్రలోసమంత ఒదిగిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇవీ చూడండి.. రామానాయుడు స్టూడియోలో '22' షూటింగ్​ షురూ

Last Updated : Jul 23, 2019, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details