తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సామజవరగమనా..' రికార్డు చూడుమా - allu arjun new movie

'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'సామజవరగమనా' పాట యూట్యూబ్​లో రికార్డు సృష్టించింది. 5 లక్షల లైక్స్‌ సంపాదించిన తొలి తెలుగు పాటగా ఘనత సాధించింది.

అల్లు

By

Published : Oct 4, 2019, 7:25 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా నుంచి 'సామజవరగమనా' అనే పాట విడుదలై యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా అత్యంత వేగంగా యూట్యూబ్​లో 5 లక్షల లైక్స్‌ సంపాదించిన తొలి తెలుగు పాటగా సరికొత్త రికార్డును నమోదు చేసిందీ గీతం. తమన్‌ సంగీత సారథ్యంలో, సిరి వెన్నెల సాహిత్యానికి గాయకుడు సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటకు అద్భుత స్పందన లభిస్తోంది’. ఇప్పటి వరకు 17 మిలియన్స్‌ వ్యూస్‌తో సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోందీ సాంగ్.

ఈ పాటతో చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇవీ చూడండి.. టీజర్: యథార్థ గాథగా తెరకెక్కిన 'పలాస'

ABOUT THE AUTHOR

...view details