తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​కు తండ్రి కావాలని ఉందట..! - bollywood

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి కావాలనుకుంటున్నాడట. సరోగసి విధానం ద్వారా పిల్లలను పొందడానికి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం.

సల్మాన్

By

Published : May 11, 2019, 11:02 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బ్రహ్మచారి అన్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు ఈ హీరో తండ్రి కావాలనుకుంటున్నాడట. ఇందులో విచిత్రం ఏముంది అనుకుంటున్నారా? ఉంది.. పెళ్లి చేసుకుని పిల్లలను కనడం కాదు.. పెళ్లి కాకుండానే సరోగసి విధానంలో సల్మాన్‌ తండ్రి కావడానికి ఆసక్తి చూపుతున్నాడని సమాచారం.

యాభై మూడేళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకునే ఆలోచన లేదు సల్మాన్‌కి. గతంలో ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ..‘‘"ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నాన్న అని పిలిపించుకోవాలని ఆశ ఉంది. అయితే అది ఎప్పుడన్నది చెప్పలేను. కనీసం నాకు 70 సంవత్సరాలు వచ్చిన తరువాత నా బిడ్డకు టీనేజ్‌ దాటుండాలి" అని అన్నాడు.

ఇప్పటికే ఏక్తా కపూర్, షారుఖ్‌ఖాన్, కరణ్‌ జోహార్‌లాంటి వాళ్లు సరోగసి ద్వారా పిల్లలను పొందిన సంగతి తెలసిందే.

సల్మాన్‌ఖాన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. చెల్లి అర్పితఖాన్‌ కొడుకు అహిల్‌ శర్మతో సరదాగా ఉండే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఇంట్లోని తన మేనల్లుళ్లు, బంధువుల పిల్లలతో చాలా ఆప్యాయంగా ఉంటాడని కుటుంబ సన్నిహితులు చెబుతుంటారు.

ఇవీ చూడండి.. 'ఆ విషయాన్ని ఆమె ఇష్టానికే వదిలేశా'

ABOUT THE AUTHOR

...view details