తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​ఖాన్-షారుక్ ఖాన్.. ఓ మల్టీస్టారర్! - bollywood movies latest news

బాలీవుడ్​ అగ్రహీరోలు షారుక్​- సల్మాన్​.. త్వరలో ఓ మల్టీస్టారర్​లో నటించనున్నారని సమచారం. సంజయ్​లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నాడట.

salman sharukh khan multi starar movie with sanjay leela bhansali direction
ఇద్దరు ఖాన్​ల కలయికలో రానున్న సినిమా?

By

Published : Dec 20, 2019, 2:50 PM IST

'షోలే', 'చుప్​కే చుప్​కే' , 'హమ్', 'హమ్​ సాత్​ సాత్​ హై' ఇలా ఎన్నో మల్టీ స్టారర్​ చిత్రాలకు పెట్టింది పేరు బాలీవుడ్. అగ్రహీరోలు కలిసి ఒకే తెరను పంచుకొంటే, అభిమానులకు ఆ సినిమా ఓ పండగనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలైన షారుక్​​ ఖాన్​, సల్మాన్​ ఖాన్​ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారట. ఇటీవల జరిగిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో ఈ విషయం గురించి చెప్పారుప్రముఖ నిర్మాత నిఖిల్ ద్వివేది.

ఈ సినిమాకు సంజయ్​ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తాడని నిఖిల్​ చెప్పారు. స్క్రిప్టు సిద్ధం చేసేందుకు కొంత సమయం కావాలని కోరాడ ఈ డైరక్టర్. 'జీరో' తర్వాత షారుక్​​ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

సల్మాన్​ 'దబంగ్​ 3' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అనంతరం మళ్లీ ప్రభుదేవాతోనే 'రాధే' సినిమాలో నటిస్తున్నాడు భాయ్. ఇది పూర్తయినతర్వాతే.. ఈ మల్టీస్టారర్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇది చదవండి: అయ్యో.. జక్కన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్‌ కొట్టేశారట!

ABOUT THE AUTHOR

...view details