తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​ సినిమాపై ఆ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు - bollywood news

తాను చూసిన సినిమాల్లో సల్మాన్​ నటించిన 'ట్యూబ్​లైట్'​ ఓవర్​రేటెడ్​ చిత్రమని ప్రముఖ దర్శకుడు అమిత్​ శర్మ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుష్మాన్​ ఖురానా మంచి చమత్కారి అని పేర్కొన్నారు.

Salman Khan's Tubelight overrated film, says Badhai Ho director Amit Sharma
'సల్మాన్​ఖాన్​ 'ట్వూబ్​లైట్' ఓవర్​రెటెడ్​ చిత్రం'

By

Published : Jul 1, 2020, 9:30 PM IST

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​ నటించిన 'ట్యూబ్​లైట్' చిత్రం ఓవర్​రేటెడ్ సినిమా అని ప్రముఖ దర్శకుడు అమిత్​ శర్మ అభిప్రాయపడ్డారు. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఉంటే ఇంకా మంచిగా తెరకెక్కించేవాడినని పేర్కొన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమిత్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

'బజరంగి భాయిజాన్​', 'ఏక్​ థా టైగర్​' వంటి బ్లాక్​బాస్టర్​ చిత్రాల తర్వాత.. కబీర్​ ఖాన్​ దర్శకత్వంలో సల్మాన్​ నటించిన మూడో సినిమా 'ట్యూబ్​లైట్'​. 2015లో వచ్చిన లిటివ్​ బాయ్​ సినిమా ఆధారంగా తెరకెక్కింది. 1962లో భారత్​-చైనా మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో రూపొందిన చిత్రం ట్యూబ్​లైట్​.

మరోవైపు అమిత్​ శర్మ దర్శకత్వంలో వచ్చిన 'బధాయ్​ హో' చిత్ర కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా గురించి మాట్లాడుతూ.. "అతను గమ్మత్తు మనిషి. ఆయుష్మాన్​కు సెన్స్​ ఆఫ్​ హ్యూమర్​ చాలా ఉంది. అతనికి ఎన్నో జోకులు వచ్చు. అవన్నీ అద్భుతమైనవే." అని అమిత్​ వివరించారు.

ప్రస్తుతం అమిత్​ శర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మైదాన్'​. అజయ్​ దేవగన్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 16 ఎకరాల సెట్​ను ఏర్పాటు చేశారు. ఇంతలో కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​, మరోవైపు రుతుపవనాల వల్ల చిత్రీకరణ నిలిచిపోయింది. మాజీ ఫుట్​బాల్​ ప్లేయర్​ సయ్యద్​ అబ్దుల్​ రహీమ్​ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇదీ చూడండి:ప్రియాంక చోప్రా 'మల్టీమిలియన్ డాలర్' ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details