తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కృష్ణ జింక కేసు: 'సల్మాన్ కోర్టు ముందు హాజరు కావాలి' - సల్మాన్​ జింక కేసు

కృష్ణ జింకల వేట కేసులో సెప్టెంబరు 28న సల్మాన్ ఖాన్ విచారణకు హాజరవ్వాలని జోధ్​పుర్ కోర్టు ఆదేశించింది. 1998లో ఓ సినిమా షూటింగ్​లో భాగంగా కంకణి గ్రామంలో కృష్ణ జింకలను సల్మాన్​ వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది.

Salman
సల్మాన్​

By

Published : Sep 14, 2020, 7:57 PM IST

బాలీవుడ్ హీరో సల్మాన్​ ఖాన్​కు.. కృష్ణ జింకల వేట, అక్రమ ఆయుధాల కేసులో సమన్లు జారీ చేసింది జోధ్​పుర్ కోర్టు. సెప్టెంబరు 28న న్యాయస్థానం ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

1998లో 'హమ్ సాత్ సాత్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా జోధ్​పుర్​లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో లైసెన్స్ లేకుండా ఆయుధాలను కలిగి ఉన్నందున ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్మాన్ పై కేసు నమోదు చేసింది. దీనిపై జైలుకు కూడా వెళ్లాడీ నటుడు. ప్రస్తుతం బెయిల్​పై బయట ఉన్నాడు.

ఇదీ చూడండి నాన్న వ్యాయామం చేస్తున్నారు: చరణ్

ABOUT THE AUTHOR

...view details