కరోనాతో నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'రాధే' సినిమా.. ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందట. ముంబయిలోని మెహబూబ్ స్టూడియోలో ఓ ఫ్లోర్‌ను ఇందుకోసం చిత్రబృందం బుక్ చేసుకుందని సమాచారం. అయితే పరిమిత సంఖ్యలో నటీనటులతో దీనికి హాజరు కానున్నారట.
త్వరలో సినిమా షూటింగ్‌కు సల్మాన్‌ఖాన్!
స్టార్ హీరో సల్మాన్‌ఖాన్.. త్వరలో 'రాధే' సెట్లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అంతా సిద్ధం చేస్తోందని సమాచారం.
రాధే
ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా 'రాధే'కు దర్శకుడు. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్. జాకీ ష్రాఫ్, రణ్‌దీప్ హుడా, భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతుల్ అగ్నిహోత్రి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.
ఇది చూడండి : క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రముఖ నిర్మాత మృతి