కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ అందరి జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. ఈ క్రమంలోనే సినీ తారలు షూటింగులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ మహారాష్ట్రలోని తన ఫాంహౌస్‌లో నివసిస్తున్నాడు. తాజాగా తన పొలంలో పని చేస్తూ శరీరమంతా మట్టిని పులుముకుని కనిపించాడీ కండలవీరుడు. అందుకు సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ.. 'రైతులకు గౌరవార్థం' అని రాసుకొచ్చాడు.
ఈ లాక్డౌన్ సమయంలో సల్మాన్ ఎక్కువగా వ్యవసాయ క్షేత్రంలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ తరహాలోనే పోస్టులను అభిమానులతో పంచుకున్నాడు.