తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈవెంట్​ రద్దు చేసుకున్న సల్మాన్.. అందుకోసమేనా..!​ - ఈవెంట్​ రద్దు చేసుకున్న సల్మాన్.. అందుకోసమేనా..!​

అమెరికాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరుకావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల దీనిని రద్దు చేసుకున్నాడని సమాచారం​.

Salman Khan cancels US tour by Pakistani organiser
ఈవెంట్​ రద్దు చేసుకున్న సల్మాన్.. అందుకోసమేనా..!​

By

Published : Feb 6, 2020, 11:36 AM IST

Updated : Feb 29, 2020, 9:28 AM IST

అమెరికా హ్యూస్టన్​లో జరగనున్న ఓ ప్రైవేట్​ ఈవెంట్​ను బాలీవుడ్ నటుడు​ సల్మాన్​ఖాన్ రద్దు చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది​. ఈ కార్యక్రమాన్ని పాకిస్థాన్​కు చెందిన రెహన్​ సిద్ధిఖీ ఏర్పాటు చేశాడు.అతడు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ అమెరికాలో విరాళాలు సేకరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో రెహన్ నిర్వహించే ఈ కార్యక్రమానికి సల్మాన్​ హాజరు కావట్లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సల్మాన్​​ ఇంకా స్పందించలేదు.

సిద్ధిఖీ కొన్నేళ్లుగా బాలీవుడ్​ స్టార్లతో సంగీత కచేరీలు నిర్వహించి వాటి ద్వారా భారత వ్యతిరేక చర్యలకు విరాళాలు సేకరిస్తున్నాడని సమాచారం. అతడు ఇప్పటి వరకు 400 కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. వాటిలో హిందీ సినీపరిశ్రమకు చెందిన సైఫ్​ అలీఖాన్​, మిఖా సింగ్​, పంకజ్​ ఉధాస్​, రాపర్​ బాద్షా వంటి ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారని తెలిసింది. 2019లో రెహన్​ ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్​ను సింగర్​ దిల్జిత్​ దొసాంజ్ ఇదే విధంగా​ రద్దు చేసుకున్నాడు.

భారత్​లో ప్రస్తుతం చర్చనీయాంశమైన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడానికి రెహన్​ సిద్ధిఖీ విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి..'ఆర్​ఆర్​ఆర్​' విడుదల తేదీకి 'కేజీఎఫ్​ 2'..!

Last Updated : Feb 29, 2020, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details