తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేమతో పోటీ నుంచి తప్పుకున్నారు - inshah allah

సల్మాన్, అక్షయ్ వచ్చే ఏడాది ఒకేసారి తమ చిత్రాల్ని విడుదల చేయడం లేదు. అనుకున్న తేదీ కంటే కాస్త ముందుగానే 'సూర్యవంశీ' సినిమాను తీసుకువస్తున్నట్లు నిర్మాత కరణ్​ జోహార్ ట్వీట్ చేశాడు.

ప్రేమతో పోటీ నుంచి తప్పుకున్నారు

By

Published : Jun 13, 2019, 7:42 AM IST

ఈద్‌ అంటే పండగ మాత్రమే కాదు.. ప్రతీ సంవత్సరం సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా విడుదలయ్యే రోజు. ఒక్క 2013 మినహా 2009 నుంచి ఇప్పటి వరకు ఈద్‌ కానుకగా సల్మాన్‌ చిత్రం విడుదలైంది. ఈ ఏడాది అదే సమయానికి ‘భారత్‌’ సినిమాతో సందడి చేశాడీ హీరో.

వచ్చే ఈద్‌కు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వలో సల్మాన్‌ నటిస్తున్న ‘ఇన్‌షా అల్లా’ రాబోతోంది. అదే సమయంలో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌ ‘సూర్యవంశీ’ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం కొద్దిరోజుల కిందట ప్రకటించింది. దీంతో సల్మాన్, అక్షయ్‌ల మధ్య పోటీ తప్పదని అనుకున్నారు. అయితే ఈ పరిస్థితిని తప్పించడానికి ‘సూర్యవంశీ’ని కాస్త ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించారు.

‘‘కిలాడీ, బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ కలసి మార్చి 27నే ‘సూర్యవంశీ’తో వస్తున్నారు. సల్మాన్‌కు ప్రేమతో..’’ కరణ్‌ జోహార్‌, చిత్ర నిర్మాత

‘‘రోహిత్‌ను ఎప్పటికీ నా తమ్ముడిగానే భావించాను. అది నిజమే అని ఈరోజు తను నిరూపించాడు’’ సల్మాన్‌, బాలీవుడ్ హీరో

సల్మాన్​ఖాన్ ట్వీట్

ఇది చదవండి: తాప్సీ సినీ ప్రయాణం సాగిందిలా...

ABOUT THE AUTHOR

...view details