లాక్డౌన్ నిబంధనలను సడలించిన క్రమంలో సినీతారలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. జాగింగ్, వాకింగ్‌లతో పాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ఇలానే బాలీవుడ్ స్టార్ జోడీ సైఫ్, కరీనాలు.. కుమారుడు తైమూర్ అలీఖాన్‌తో మంబయి మెరైన్ డ్రైవ్‌కు వెళ్లారు. అక్కడ మాస్క్‌లు ధరించకుండా స్వీయచిత్రాలను దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సైఫ్-కరీనాలపై విమర్శలు చేస్తున్నారు. అయితే వారు తమ ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకోలేదు.
ప్రజల్లో అవగాహన పెంచాల్సిన సెలబ్రెటీలు ఈ విధంగా చేయడం ఏ మాత్రం బాగోలేదని కొంతమంది వారిపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో అవసరం ఉంటే తప్ప సరదాగా బయటకు వెళ్లొద్దని మరికొంత మంది వారిద్దరిని ఉద్దేశించి కామెంట్లు చేశారు.