తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తమన్​కు ఖరీదైన బహుమతిచ్చిన మెగాహీరో - ప్రతిరోజూ పండగే సినిమా

సంగీత దర్శకుడు తమన్​కు ఖరీదైన వర్క్​ స్టేషన్​ను బహుమతిగా ఇచ్చాడు హీరో సాయిధరమ్ తేజ్​. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్​లో 'ప్రతిరోజూ పండగే', 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలు తెరకెక్కుతున్నాయి.

తమన్-సాయిధరమ్ తేజ్

By

Published : Nov 25, 2019, 8:18 PM IST

మెగాహీరో సాయిధరమ్ తేజ్-సంగీత దర్శకుడు తమన్.. 'ప్రతిరోజూ పండగే' సినిమా కోసం ఐదోసారి కలిసి పనిచేస్తున్నారు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిరీత్యా వీరిద్దరి మంచి స్నేహితులు. ఆ అనుబంధంతోనే తమన్​కు ఖరీదైన పెర్ల్ మలెట్ వర్క్ స్టేషన్​ను బహుమతి ఇచ్చి, అతడిని ఆశ్చర్యపరిచాడు సాయిధరమ్.

సాయిధరమ్ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది.

'ప్రతిరోజూ పండగే' సినిమాలో రాశీఖన్నా హీరోయిన్. కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు. వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రతిరోజూ పండగే సినిమా పోస్టర్

ఇది చదవండి: సాయిధరమ్​ 'ట్రెండ్​' ఫాలో అవుతున్నాడు..!

ABOUT THE AUTHOR

...view details