'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి.. మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'అలివేలు మంగ వేంకటరమణ'లో కథానాయికగా ఈమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
'అలివేలు మంగ' పాత్రలో సాయిపల్లవి? - sai pallavi love story
గోపీచంద్-తేజ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ చేయనుందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'అలివేలు మంగ' పాత్రలో సాయిపల్లవి?
తొలుత ఈ రోల్లో కీర్తి సురేశ్ నటించనుందని అన్నారు. ఆ తర్వాత అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు సాయిపల్లవిని దాదాపు ఖరారు చేసినట్లేనే చెబుతున్నారు.
ప్రస్తుతం 'విరాటపర్వం', 'శ్యామ్ సింగరాయ్'లో సాయిపల్లవి నటిస్తోంది. 'లవ్‌స్టోరి' విడుదలకు సిద్ధంగా ఉంది.