ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో 'సాహో' ఒకటి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం వల్ల ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో వచ్చే బైక్ ఛేజింగ్ సన్నివేశాలు, పోరాట దృశ్యాలు హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇవి ఏ స్థాయిలో ఉండబోతున్నది.. సాహో షేడ్స్‌తో ప్రేక్షకులకు శాంపిల్ రుచి చూపించేశారు.
సాహో దెబ్బకు వాహనాలన్నీ తుక్కుతుక్కు... - సాహో షేడ్స్
'బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాల కోసం ట్రక్కులు, ఖరీదైన కార్లు, స్పోర్ట్స్ బైక్‌లు వాడుతున్నారు. చిత్రీకరణ తర్వాత వాటి పరిస్థితి ఏమైందో ఓసారి చూడండి...
ప్రభాస్ ఛేజింగ్‌కు పార్టులు తప్పిన కారు...
'సాహో' చిత్రీకరణ పూర్తయిందని నటుడు మురళీ శర్మ ట్వీట్ చేశారు. ముంబయిలోని ఆంబే వ్యాలీలో ఛేజ్ సన్నివేశాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరినట్లు తెలిపారు. చిత్రీకరణలో పూర్తిగా ధ్వంసమైన కారును తరలిస్తుండగా తీసిన వీడియోను షేర్ చేశారు. ఈ దృశ్యాలు చూశాక సినిమాపై మరింత అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు.