తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సాహో' ప్రీ రిలీజ్​ సందడి అదరహో - sahoo

యంగ్ ​రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన 'సాహో' సినిమా ప్రీ రిలీజ్​ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీ వేదికగా కార్యక్రమం ఏర్పాటైంది.

'సాహో' ప్రీ రిలీజ్​ వేడుకకు సర్వం సిద్ధం

By

Published : Aug 18, 2019, 4:38 PM IST

Updated : Sep 27, 2019, 10:10 AM IST

డార్లింగ్​​ ప్రభాస్‌ నటించిన 'సాహో' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీ ఘనంగా ఆతిథ్యమిస్తోంది. ఈ వేడుక ప్రారంభం అయింది. కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు పోటెత్తుతున్నారు.

ఈ వేడుకలో భాగంగా ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. సినిమాలోని పలు యాక్షన్​ సన్నివేశాలను ప్రతిబింబించేలా వాహనాలు, బంకర్లు, లైట్లతో అలంకరణలు చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

60 అడుగుల ప్రభాస్​ కటౌట్​, లైట్లతో వేదిక, యాక్షన్​ సన్నివేశాలను తలపించేలా ఆకృతులు

'సాహో' సినిమాకు సుజిత్‌ దర్శకుడు. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు విశేషమైన స్పందన లభించింది.

అభిమానులతో నిండిన వేడుక ప్రాంగణం
Last Updated : Sep 27, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details