తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహో: ఆ సన్నివేశాల​​ కోసం రూ.70 కోట్లు! - ప్రీక్లైమాక్స్​ రూ.70 కోట్లు

యాక్షన్​ థ్రిల్లర్​ 'సాహో'లోని ప్రీక్లైమాక్స్​ కోసం రూ.70 కోట్లు ఖర్చుచేశారని సమాచారం. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సాహో

By

Published : Aug 25, 2019, 4:53 PM IST

Updated : Sep 28, 2019, 5:32 AM IST

బాహుబలి స్టార్ ప్రభాస్​ నటించిన యాక్షన్ ఎంటర్​టైనర్​​... 'సాహో'. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో భారీ ఖర్చుతో తెరకెక్కించిన ప్రీక్లైమాక్స్​ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఇందుకోసం ఏకంగా రూ.70 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. సుమారు 12 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్​ను హాలీవుడ్​ స్టంట్​ డైరక్టర్​ కెన్నీ బేట్స్​ రూపొందించాడు.

సాహోలో శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటించింది. అరుణ్ విజయ్, నీల్​ నీతేశ్​ముఖ్, జాకీష్రాఫ్, మహేశ్​ మంజ్రేకర్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్​ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.350 కోట్లతో నిర్మించింది. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది 'సాహో'.

ఇదీ చూడండి: 'చీమ-ప్రేమ మధ్యలో భామ' విడుదలకు సిద్ధం

Last Updated : Sep 28, 2019, 5:32 AM IST

ABOUT THE AUTHOR

...view details