తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోరాటాల 'సాహో'- అదరగొట్టిన ప్రభాస్​ - prabhas

యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్ నటించిన 'సాహో' టీజర్ విడుదలైంది. శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

సాహో

By

Published : Jun 13, 2019, 11:41 AM IST

Updated : Jun 13, 2019, 11:54 AM IST

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్​ 'సాహో' చిత్ర టీజర్ విడుదలైంది. ఆసక్తిగొలిపే యాక్షన్ సన్నివేశాలతో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు.

ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు... పోరాటాలతో ఆసక్తిరేపుతోంది సాహో. హాలీవుడ్ సినిమాలను మైమరిపించే రీతిలో ప్రభాస్ కుమ్మేశాడు. "ఎవరు వారు.. ఫ్యాన్స్​.. డై హార్డ్​ ఫ్యాన్స్"​ అంటూ చివర్లో యంగ్ రెబల్ స్టార్ చెప్పే డైలాగులు అలరిస్తున్నాయి.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రూపూదిద్దుకున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, ఎవలీన్ శర్మ లాంటి భారీ తారాగణం ఇందులో నటించారు.

Last Updated : Jun 13, 2019, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details