తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భారత మహిళలు ఎవరికీ తక్కువ కాదు' - taapsee

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 'సాండ్​ కీ ఆంఖ్' సినిమా పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ బయోపిక్​ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాండ్​ కీ ఆంఖ్

By

Published : Aug 30, 2019, 11:15 AM IST

Updated : Sep 28, 2019, 8:26 PM IST

తాప్సీ, భూమి పడ్నేకర్ ప్రధాన పాతల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'సాండ్​​ కీ ఆంఖ్​'. ప్రపంచంలోనే వయో వృద్ధ షూటర్లుగా పేరు తెచ్చుకున్న చంద్రో తోమార్​ (82), ప్రకాషి తోమార్(82) పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సినిమా కోసం షూటింగ్​లో శిక్షణ తీసుకున్నారు తాప్సీ, భూమి. ఇందులో చంద్రో తోమార్ పాత్రలో భూమి నటిస్తుండగా.. ప్రకాషి పాత్రను తాప్సీ పోషిస్తోంది.

భూమి పడ్నేకర్ - తాప్సీ

"గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ భారత మహిళలు ఎవరికీ తక్కువ కాదని నిరూపించారు. వారు (చంద్రో , ప్రకాషి) కన్న కలను నిజం చేసుకునేందుకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. షూటింగ్​లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు" -తాప్సీ, హీరోయిన్

తనకు చంద్రో తోమార్ షార్ప్ షూటింగ్​లో శిక్షణ ఇచ్చిందని భూమి పడ్నేకర్ తెలిపింది.

"మీరట్ చుట్టుపక్కల గ్రామాల్లోని చాల మందిని కలిశా. ప్రతి ఒక్కరికి షూటింగ్​ అంటే ఎంత ఇష్టమో తెలుసుకున్నా. ఆట పట్ల వారికున్న ఉత్సుకత, పట్టుదల, కఠోర శ్రమను చూస్తుంటే ఆశ్చర్యమేసింది"
-భూమి పడ్నేకర్, హీరోయిన్

తుషార్ హిరానందాని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నాడు. ప్రకాశ్ జా, వినీత్ కుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: షార్ట్​ఫిల్మ్స్​ నుంచి సాహో వరకు ఎదిగిన సుజీత్​

Last Updated : Sep 28, 2019, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details