తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గూగుల్ ప్లే స్టోర్​లో సాహో వీడియో గేమ్​ - android

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సాహో వీడియో గేమ్ గూగుల్ ప్లే స్టోర్​లోకి వచ్చేసింది. ఇప్పటికే ఐఓఎస్​లో విడుదలైన ఈ గేమ్​ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాహో

By

Published : Aug 17, 2019, 10:21 AM IST

Updated : Sep 27, 2019, 6:38 AM IST

ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం పేరుతో వీడియో గేమ్​ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐఓఎస్​లో వచ్చిన ఈ గేమ్​ను తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ప్లే స్టోర్​లో అందుబాటులో ఉంచింది చిత్రబృందం. ఇటీవలే ఈ వీడియో గేమ్ ట్రైలర్​ను విడుదల చేసింది.

ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ.

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది చిత్రబృందం. ఆదివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్​సిటీలో సినిమా విడుదల ముందస్తు వేడుక నిర్వహించనుంది.

శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రూ.300 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది చదవండి: 'అ' సెంటిమెంట్​ కొనసాగించిన త్రివిక్రమ్‌

Last Updated : Sep 27, 2019, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details