తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్​ అదిరింది... మరి ట్రైలర్​ ఎప్పుడు? - విడుదల

జులై 1న సాహో ట్రైలర్​ విడదల కానుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా అధికార ప్రకటన చేయలేదు. గురువారం విడుదలైన టీజర్​ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

టీజర్​ అదిరింది... మరి ట్రైలర్​ ఎప్పుడు?

By

Published : Jun 14, 2019, 9:58 AM IST

యంగ్​ రెబల్​ స్టార్​​ ప్రభాస్​ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్​ థ్రిల్లర్​ 'సాహో.' గురువారం విడుదలైన ఈ సినిమా టీజర్​ విశేష ఆదరణ పొందుతోంది. బాహుబలి-2 అనంతరం ప్రభాస్​ హీరోగా వస్తున్న చిత్రం కావడం వల్ల సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్​ ఆ అంచనాలను మరింత పెంచింది.

డార్లింగ్​ ప్రభాస్​ తన అభిమానులకు త్వరలోనే మరో బహుమతిని ఇవ్వనున్నాడు. జులై 1న సాహో ట్రైలర్​ విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు.

300 కోట్లకుపైగా బడ్జెట్​తో రూపోందించిన సాహోలో ప్రభాస్​కు జోడీగా బాలీవుడ్​ కథానాయిక శ్రద్ధా కపూర్​ నటించింది. ఈ చిత్రానికి సుజీత్​ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది సాహో.

ఇదీ చూడండి:- 'నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పట్టించుకోను'

ABOUT THE AUTHOR

...view details