తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రఖ్యాత 'గ్రాండ్​ రెక్స్'​ థియేటర్​లో 'సాహో' - bahubali

ప్యారిస్​ నగరంలోని ప్రఖ్యాత 'ద గ్రాండ్​ రెక్స్​' థియేటర్​లో 'సాహో' విడుదల కానుంది. అక్కడ ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఆ వీడియోలు ట్విట్టర్​లో వైరల్​ అవుతున్నాయి.

సాహో సినిమాలో ప్రభాస్

By

Published : Aug 16, 2019, 7:18 PM IST

Updated : Sep 27, 2019, 5:23 AM IST

దేశమంతటా 'సాహో' సందడి ఇప్పటికే మొదలైంది. రూ.350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్​తో సంచలనం సృష్టించిన ఈ సినిమా మరో ఘనత సొంతం చేసుకుంది. ప్యారిస్​​లోని ప్రఖ్యాత 'ద గ్రాండ్ రెక్స్' థియేటర్​లో ప్రదర్శనకు ఎంపికైంది.

ఈ థియేటర్​ ప్రత్యేకతలు..

1932లో ప్రారంభమైన 'ద గ్రాండ్​ రెక్స్'... ఐరోపా​లోనే అతిపెద్ద థియేటర్​గా పేరు సంపాదించింది. అప్పటినుంచి సాంస్కృతిక, కళా, సినిమా ప్రదర్శనలకు వేదికైంది. ఇందులో 2,800 మంది ఒకేసారి కూర్చోవచ్చు. ఇప్పుడు 'సాహో'ను ఇక్కడ రిలీజ్​ చేయనున్నారు.

ప్రఖ్యాత గ్రాండ్​ రెక్స్​ థియేటర్

గతంలో రజనీకాంత్ 'కబాలి', విజయ్ 'మెర్సల్', 'బాహుబలి' సినిమాలను ప్రదర్శించారు. ఈ నెల 30న 'సాహో' విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ థియేటర్ గోడలపై 'సాహో' వీడియోలతో ప్రచారం మొదలైపోయింది.

ఇది చదవండి: మధుర జ్ఞాపకాలను మిగిల్చింది 'సాహో': శ్రద్ధా

Last Updated : Sep 27, 2019, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details