సాహో.. ఎన్నో అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విడుదలై నెలన్నర దాటిందో లేదో అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేసింది. ప్రైమ్‌లో తెలుగు వర్షన్ అందుబాటులో ఉంచారు కానీ హిందీలో ఈ సినిమాను పెట్టలేదు. ఈ కారణంగా ప్రభాస్ బాలీవుడ్ అభిమానులు నెట్టింట తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సాహో హిందీ వర్షన్ ఎందుకు పెట్టలేదంటూ కొంతమంది ఔత్సాహికులు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే సాహో హిందీ వర్షన్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు ఇచ్చారని, అక్టోబరు 23 లేదా నవంబరు 1 నుంచి అందులో లభ్యమవుతుందని కొందరు రిప్లై ఇచ్చారు.