తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బైక్​పై ప్రభాస్.. అభిమానులకు సర్​ప్రైజ్​ - శ్రద్ధ కపూర్

సాహో సినిమాలోని ప్రభాస్ మరో లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.​

బైక్​పై ప్రభాస్.. అభిమానులకు సర్​ప్రైజ్​

By

Published : May 27, 2019, 2:16 PM IST

సాహో... ప్రభాస్​ నటిస్తున్న చిత్రం. షూటింగ్​ మొదలైనప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం విడుదల చేసిన ప్రభాస్​ ఫస్ట్​లుక్​కు విపరీతమైన స్పందన వచ్చింది. హీరో ప్రభాస్​ బైక్​పై వెళ్తున్న మరో లుక్​ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ముందుగా సమాచారం ఇవ్వకుండా వారిని సర్​ప్రైజ్ చేసింది.

సాహో సినిమాలో ప్రభాస్​ కొత్త లుక్

ఈ సినిమాలో శ్రద్ధ కపూర్​ హీరోయిన్​గా నటిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతోందీ చిత్రం. పూర్తిస్థాయి యాక్షన్​ ఎంటర్​టైనర్​గా అభిమానుల్ని అలరించనుంది. యూవీ క్రియేషన్స్​ నిర్మాతగా వ్యవహరిస్తోంది. శంకర్-ఎహసన్-లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: సాహో పోస్టర్​ విడుదల.. స్టైలిష్​ లుక్​లో ప్రభాస్​

ABOUT THE AUTHOR

...view details