తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం 'సాహో' - ప్రభాస్

యాక్షన్ అడ్వెంచర్​గా రూపొందిన 'సాహో' ఎమోజీని తయారు చేసింది ట్విట్టర్​. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సాధించింది.

సాహో సినిమాలో ప్రభాస్

By

Published : Aug 23, 2019, 5:33 PM IST

Updated : Sep 28, 2019, 12:29 AM IST

యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' విడుదలకు సిద్ధమవుతోంది. ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్​ అంచనాల్ని పెంచేస్తోంది. ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్​లో ఎమోజీ పొందిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇప్పటివరకు హాలీవుడ్​లో 'ద లయన్ కింగ్', 'అవెంజర్స్:ఎండ్​గేమ్', 'స్పైడర్​ మ్యాన్'​ వంటి చిత్రాలు ఎమోజీలు పొందాయి. ఈ జాబితాలో 'సాహో' చేరింది. ఈ విషయంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఎమోజీ పొందామని చెపుతూ యూవీ క్రియేషన్స్​ ట్వీట్

ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటించింది. భారీతారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సుజీత్​ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్​ సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించింది.

సాహో సినిమా సెన్సార్ సర్టిఫికెట్

అయితే శుక్రవారం సెన్సార్​ పూర్తి చేసుకున్న 'సాహో' యూ/ఏ సర్టిఫికెట్​ సొంతం చేసుకుంది. సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాలు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'సాహో' కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు: ప్రభాస్

Last Updated : Sep 28, 2019, 12:29 AM IST

ABOUT THE AUTHOR

...view details