ప్రభాస్ నటించిన 'సాహో' వసూళ్ల సునామీ ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించట్లేదు. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్తోన్న సినిమా... ఈ వారంతానికి రూ. 400 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. ఒక్క హిందీలోనే రూ. 102 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది.
ఆగస్టు 30న విడుదలైన సాహో సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నప్పటికీ ఆ ప్రభావం కలెక్షన్లపై పెద్దగా కనిపిచట్లేదు. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనత సాధించింది.