కొన్ని కొత్త సినిమాలకు సంబంధించి ఇటీవల అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక హీరోతో సినిమా చేయాల్సిన దర్శకుడు, మరో హీరో కోసం రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఈమధ్యే రెండు మూడు ప్రాజెక్టుల విషయంలో అలాంటి మార్పులు జరిగాయి.
విజయ్-సుకుమార్ సినిమాపై వదంతులు - cinema news
సుకుమార్-విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసింది నిర్మాణ సంస్థ. వారి ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయ్యాక, అది సెట్స్‌పైకి వెళ్తుందని తెలిపింది.
విజయ్-సుకుమార్
దీంతో సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబోలోని సినిమా విషయంలోనూ అలాంటి ప్రచారమే సాగింది. కానీ చిత్రాన్ని నిర్మిస్తున్న ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ ఆ ప్రచారాన్ని తోసిపుచ్చింది. విజయ్ - సుకుమార్ ఒప్పందాలు పూర్తయ్యాక, ప్రణాళిక ప్రకారమే ఈ సినిమా ప్రారంభమవుతుందని, అందులో ఎలాంటి మార్పు లేదని సదరు సంస్థ ప్రకటించింది.