RRR Worldwide Collection Day 5: రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. మార్చి 25న రిలీజైన ఈ సినిమా ఐదు రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం హిందీలోనే రూ.100 కోట్ల (గ్రాస్) మార్కును దాటగా నైజాంలోనూ సెంచరీ కొట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. మంగళవారం నాటికి 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
నైజాం గులాం..:నైజాంలో ఐదు రోజుల్లోనే రూ.101.5 కోట్ల గ్రాస్ వసూళ్లు (రూ.68.30 కోట్ల షేర్) సాధించింది 'ఆర్ఆర్ఆర్'. ఆంధ్రలో రూ.97.3 కోట్ల గ్రాస్ వసూళ్లు (రూ.97.17 కోట్ల షేర్) రాబట్టింది. సీడెడ్‌లో రూ.44.3 కోట్లు (రూ.33.48 కోట్లు షేర్) కొల్లగొట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 242 కోట్ల గ్రాస్ వసూళ్లు (రూ.168.95 కోట్ల షేర్) వచ్చేయి.
తమిళనాడు, కర్ణాటకలో బాక్సాఫీస్ బద్దలు:తమిళనాడులో ఐదురోజులకు కలిపి రూ.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది 'ఆర్ఆర్ఆర్'. కేరళలో మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక కర్ణాటకలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది 'ఆర్ఆర్ఆర్'. ఐదు రోజుల్లో రూ. 49.3 కోట్ల గ్రాస్ (రూ.26.6 కోట్ల షేర్) సాధించింది.
RRR Box Office Collection in India: భారత్‌లోనే రూ.500 కోట్లు!:ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ. 132.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'ఆర్ఆర్ఆర్'. దీంతో ఐదు రోజుల్లో ఆల్‌ఇండియాలో 'ఆర్ఆర్ఆర్' లెక్క రూ.500 కోట్లకు చేరువైంది. మంగళవారం నాటికి భారత్‌లో రూ.475.5 కోట్లను (రూ.284.45 కోట్ల షేర్) రాబట్టింది.
RRR Box Office Collection Worldwide: 'ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు':ఐదు రోజులు పూర్తయ్యే సరికి అమెరికాలో రూ.78.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది 'ఆర్ఆర్ఆర్'. ఇతర దేశాల్లో దాదాపు రూ.57 కోట్ల గ్రాస్ సాధించింది ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజులకే 'ఆర్ఆర్ఆర్' రూ.611 కోట్ల పైచిలుకు వసూళ్లను (రూ.353.3 కోట్ల షేర్) సాధించినట్లు తెలుస్తోంది.