ఎన్టీఆర్-రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్(వర్కింగ్ టైటిల్). బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
వచ్చే ఏడాదే "ఆర్.ఆర్.ఆర్" - రాజమౌళి
మరో బ్లాక్‌బస్టర్ కొట్టేందుకు రాజమౌళి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. తను తెరెకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు.
విడుదల తేదీని ఖరారు చేసుకున్న ఆర్.ఆర్.ఆర్
అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని, అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించనున్నాడు. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నాడు. త్వరలో కోల్‌కతాలో చిత్రీకరణ జరుపుకోనుందీ సినిమా. కీరవాణి స్వరాలు సమకూర్చగా విజయేంద్ర ప్రసాద్ కథనందించారు.
Last Updated : Mar 14, 2019, 4:34 PM IST