తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చేది అక్టోబరులోనా? - BOLLYWOOD NEWS

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్'.. ఈ జూలైలో కాకుండా అక్టోబరులో రానుందనే వార్త.. ప్రస్తుతం విస్తృతమవుతోంది. సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్ చేసిన ఓ ట్వీట్ ఇందుకు కారణం.

RRR MOVIE POSTPONED TO OCTOBER?
ఆర్​ఆర్ఆర్ విడుదల తేదీ మార్పు

By

Published : Jan 18, 2020, 6:42 PM IST

టాలీవుడ్​ ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'ను ఈ ఏడాది జూలై 30న విడుదల చేస్తామని, సినిమా మొదలు కాకముందే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ మారిందనే వార్త.. హాట్​ టాపిక్​గా మారింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్.. శనివారం చేసిన ఓ ట్వీట్, ఈ విషయానికి బలం చేకూరుస్తోంది. ఇందులో నిజనిజాలేమిటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఆ ట్వీట్​లో ఏముంది?

దక్షిణాదిలో బ్లాక్​బస్టర్ దర్శకుడు రూపొందిస్తున్న సినిమా విడుదల తేదీ మార్పు. సమాచారం ప్రకాకం ఈ ఏడాది అక్టోబరులో రానుంది. త్వరలో ఆ రిలీజ్​ డేట్​ ప్రకటించనున్నారు.

తరణ్​ ఆదర్శ్ చేసిన ట్వీట్

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. ఇది 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసమేనంటూ సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కాకుండా దక్షిణాదిలో రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్టు అంటే 'కేజీఎఫ్-2' కావొచ్చు. కానీ ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల తేదీ ప్రకటించకపోవడం వల్ల, ఈ వార్త ఇందుకు కోసం కాకపోవచ్చని కొందరు అంటున్నారు.

'ఆర్​ఆర్ఆర్'లో అగ్రహీరోలు జూనియర్.ఎన్టీఆర్, రామ్​చరణ్ నటిస్తున్నారు. తారక్.. కొమరం భీమ్​గా, చరణ్​.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details