కన్నడ నటుడు కిచ్చా సుదీప్ శాండిల్‌వుడ్‌లోనే కాకుండా పలు చిత్రసీమల్లో రాణిస్తున్నాడు. ఇటీవలే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరాలో నటించిన ఇతడు... ఆ తర్వాత బాలీవుడ్లో సల్మాన్‌తో 'దబాంగ్ 3'లో కనిపించాడు. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'లోనూ ఓ కీలకపాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. మల్టీసారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. వీరిద్దరి కలయికతో ఈ సినిమాపై ఆసక్తితోపాటు అంచనాలూ భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల హాలీవుడ్ తారలను పరిచయం చేశాడు జక్కన్న. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటికి వచ్చింది. ఇందులో కన్నడ స్టార్ సుదీప్ నటిస్తున్నాడట. ఆయన పోషించే పాత్ర గురించి కూడా సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
సుదీప్ పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ', 'బాహుబలి' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు కిచ్చా.
దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో జులై 30న విడుదల కానుంది.